ఫ్లోరిడా ఈతకొలనులో 31 ఏళ్ల హైదరాబాద్ డెలీవరీ ఏజెంట్ మృతి

బుధవారం, 4 అక్టోబరు 2023 (10:13 IST)
అమెరికాలోని ఫ్లోరిడా ఈతకొలనులో హైదరాబాద్‌కు చెందిన 31 సంవత్సరాల డెలివరీ ఏజెంట్ మొహమ్మద్ ముస్తఫా షరీఫ్ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. ఈ నెల 2న పార్సిల్ డెలివరీకి వెళ్లిన ఆయన ఆ తర్వాత మృతి చెంది శవమై తేలాడు. 
 
హైదరాబాద్‌లోని ఆర్సీఐ బాలాపూర్‌లో ఉంటున్న ఆయన కుటుంబం ముస్తఫా మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీయాలని డిమాండ్ చేసింది. 
 
ముస్తఫా పార్శిల్ డెలివరీ కోసం వెళ్లాడని, అరగంట తర్వాత పార్టీ ఏరియాలోని స్విమ్మింగ్ పూల్‌లో అతడి శవం తేలుతూ కనిపించిందని ముస్తఫా సోదరుడు మొహమ్మద్ నవాజ్ షరీఫ్ తెలిపారు.షరీఫ్‌కు భార్య తాహెరా బాను, రెండేళ్ల మహమ్మద్ షేజాద్, ఐదు నెలల వయసున్న మొహమ్మద్ హమ్జా ఉన్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు