ఇటలీలో బస్సు వంతెనపై నుంచి పడి మంటలు చెలరేగడంతో 21 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. బస్సు వెనిస్ నుంచి క్యాంపింగ్ ప్రదేశానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
వెనిస్‌లో మీథేన్‌తో నడుస్తున్న బస్సు వంతెనపై నుండి పడి మంటలు చెలరేగడంతో మంగళవారం ఇద్దరు పిల్లలు, విదేశీయులతో సహా కనీసం 21 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.
ఉత్తర ఇటాలియన్ నగరంలోని మెస్ట్రే, మర్గెరా జిల్లాలను కలుపుతూ రైల్వే లైన్‌పై వంతెనపైకి వెళ్లడం వల్ల బస్సులో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ ప్రమాదం పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.