కట్టుకున్న భర్తను, ప్రేమించిన ప్రియుడిని దారుణంగా హత్య చేసి, మరో వ్యక్తితో ఎంజాయ్ చేస్తూ, పోలీసులకు పట్టుబడి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఒక యువతి తన స్వియ చరిత్రను విడుదల చేసింది.
ఆస్ట్రియా దేశానికి చెందిన కరన్సా ఐస్క్రీమ్ దుకాణం నడుపుతుంది. ఈమె 2008లో భర్తను, 2010లో ప్రియుడిని కాల్చి చంపేసింది. ఆ తర్వాత వారి ఇద్దరి మృత దేహాలను ఐస్క్రీమ్ దుకాణంలోనే పూడ్చిపెట్టింది. విడాకులు పొందిన తర్వాత కూడా తనకు స్వేచ్చనివ్వకుండా ఇంటికి వస్తున్నాడని భర్తను, ప్రతి రోజూ మద్యం సేవించి వస్తున్నాడని ప్రియుడిని ఆమె హతమార్చింది.