ఎలక్ట్రానిక్ వార్ఫేర్‌ను మొహరించిన భారత్ : అష్టదిగ్బంధనం చేస్తోందంటూ పాక్ గగ్గోలు...

ఠాగూర్

గురువారం, 1 మే 2025 (12:30 IST)
పాకిస్థాన్‌కు చెందిన విమానాలకు నేవిగేషన్ సిగ్నల్ అందకుండా భారత్ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను మొహరించింది. ఈ విషయాన్ని గ్రహించిన పాక్ గగ్గోలు పెడుతోంది. తమను భారత్ అష్టదిగ్బంధనం చేస్తోందంటూ విలపిస్తోంది. 
 
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పట్ల భారత్ మునుపెన్నడూ లేనివిధంగా కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా, పాక్ మిలిటరీ విమానాలు లక్ష్యాలను గుర్తించేందుకు వీలులేకుండా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను పశ్చిమ సరిహద్దుల్లో మొహరించింది. ఇవి పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సంకేతాలను బలంగా అడ్డుకుంటాయి. దీంతో ఆ దేశ సైనిక, పౌర రవాణా విమానాలు వినియోగించే జీపీఎస్ (అమెరికా), గ్లోనాస్ (రష్యా), బైడూస్ (చైనా) నేవిగేషన్‌ వ్యవస్థలను సమర్థంగా అడ్డుకుంటుంది. 
 
దీంతో పాక్ సైనిక విమానాలు, డ్రోన్లు, గైడెడ్ మిస్సైల్స్ భారత్‌లో లక్ష్యాలను గుర్తించడంలో తీవ్ర గందరగోళానికి గురవుతాయి. ఫలితంగా యుద్ధ క్షేత్రంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని స్థితికి పాకిస్థాన్ సైన్యం చేరుకుటుంది. 2024 సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ లెక్కల ప్రకారం భారత్ వద్ద ఇలాంటి వ్యవస్థలు దాదాపు 50 వరకు ఉన్నాయి. ఇక వాయుసేన రఫేల్ యుద్ధ విమానాల్లో స్పెక్ట్రా సూట్స్, నేవీ వినియోగించే శక్తి సిస్టమ్స్ కూడా నేవిగేషన్ సిగ్నల్స్‌ను జామ్ చేయగలవు. దీంతో పాకిస్థాన్ ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు