చూస్తుంటే జూలై 1ని ప్రపంచ పన్నుపోటు దినోత్సవంలా ప్రకటించేలా ఉన్నారు దేశ, ప్రపంచ ప్రభుత్వాధినేతలు. మునుపటి తుగ్లక్ పాలనను గుర్తుకుతెస్తూ కనివినీ ఎరుగని పేర్లతో, సాకులతో ప్రజల పళ్లు రాలగొట్టేందుకు పన్ను పోటుని మార్గంగా ఎంచుకుని ఆ విధంగా ముందుకెళ్తున్నారు.
కుబేరుల నల్లధనాన్ని తిరిగి భారత్‌కు రప్పిస్తామనే నినాదంతో గద్దెనెక్కిన మోదీ ఆ సంగతటుంచి సామాన్య, మధ్య తరగతి ప్రజల కనీసావసరాలను కూడా గాలికొదిలేసి, బీమా రంగం, వైద్య రంగాలపై కూడా పన్నుని 18 శాతం పెంచేసి ప్రజల ప్రాణాలతో, ప్రయోజనాలతో ఆటాడేసుకుంటున్నారు. ఈ పన్నుల ఆటలో మోదీ ప్రభుత్వానికి ధీటుగా సౌదీ ప్రభుత్వం పన్ను పోటుని మరో మెట్టు పైకి తీసుకెళ్తోంది.