International Men’s Day 2024
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా సమాజం, కుటుంబాలు, సంఘాలకు పురుషులు చేసిన అమూల్యమైన సహకారాన్ని గౌరవిస్తుంది. ఇది ముఖ్యంగా కుటుంబం, వివాహం, సంఘం, దేశ నిర్మాణం, పిల్లల సంరక్షణ వంటి రంగాలలో పురుషులు, అబ్బాయిల జీవితాలు, విజయాల్లో పాత్రలను గుర్తించడానికి కేటాయించడం జరిగింది. ఈ రోజును సమాజానికి పురుషుల సేవలను గౌరవించే దిశగా జరుపుకోవడానికి ఒక అవకాశంగా ఉపయోగపడుతుంది.