పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్.. ఈసారి ఇరాన్ వంతు.. ఎందుకంటే?

శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (15:51 IST)
భారత్‌ తరహాలో పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. మరోదేశం పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్‌ జరిపింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై తాజాగా ఇరాన్‌ మెరుపు దాడులు నిర్వహించింది. కొన్నిరోజుల క్రితం భారత దేశం నిర్వహించిన మాదిరిగానే మెరుపుదాడులు( సర్జికల్‌ స్ట్రైక్‌ ) చేసింది. ఇరాన్‌ సైన్యంలోని రివల్యూషనరీ గార్డ్స్‌ దళం( ఐఆర్‌జేసీ) దీనిని నిర్వహించింది. 
 
గత కొంత కాలంగా బెలూచిస్తాన్‌లో చెరలో ఉన్న తమ సైనికులిద్దరిని విడిపించుకు వెళ్లేందుకు ఇరాన్‌ ఈ మెరుపుదాడి నిర్వహించినట్టు ఐఆర్‌జేసీ వెల్లడించింది. బెలూచిస్తాన్‌లోని జైష్‌ ఉల్‌ అదల్‌ అనే ఉగ్రవాద సంస్ధ 2018లో 12 మంది ఇరాన్‌ సైనికులను అపహరించింది. ఈ ముఠా ఇరాన్‌కు వ్యతిరేకంగా సాయుధ ఉద్యమాన్ని కొనసాగిస్తోంది.
 
ఇరాన్‌ సైనికులను విడిపించడానికి ఒక కమిటీని ఏర్పాటు అయ్యింది. తాజాగా ఇరాన్‌ నిర్వహించిన మెరుపుదాడిలో ఇద్దరు బందీలను ఇరాన్‌ విడిపించుకు వెళ్లింది. బెలూచిస్తాన్‌కు చెందిన జైష్‌ ఉల్‌అదల్‌ ఉగ్రవాద సంస్థ ఇరాన్‌ సరిహద్దుల్లో భద్రతా సిబ్బందిని అపహరించి పాకిస్తాన్‌కు తరలించుకుపోయిన ఉదంతాలు గతంలోనూ ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు