ఇరాన్ మీడియా కథనాల మేరకు బుకాన్‌కు చెందిన ఓ బాలికను అత్యాచారం, హత్య చేసిన కేసులో ఓ వ్యక్తి దోషిగా తేలాడు. అతడికి బహిరంగంగా మరణశిక్ష విధించాలని బాధిత కుటుంబసభ్యులు, ప్రజల నుంచి పెద్దఎత్తున అభ్యర్థనలు వచ్చాయి.
ఇరాన్‌లో బహిరంగంగా మరణశిక్షలు విధించడం సాధారణమే. హత్య, అత్యాచారం వంటి తీవ్రత ఎక్కువున్న కేసుల్లో ఇలాంటి కఠినమైన శిక్షలను అమలుచేస్తారు. మానవ హక్కుల సంఘాల ప్రకారం.. ప్రపంచంలో ఎక్కువ మరణశిక్షలు అమలుచేసే దేశాల్లో ఇరాన్ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా ఉంది.