అమెరికాకు మరో ఝలక్.. ఈసారి వంతు ఇరాన్!

శనివారం, 23 సెప్టెంబరు 2017 (13:56 IST)
అగ్రరాజ్యం అమెరికా హెచ్చరికలను చిన్నదేశాలు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఇప్పటికే ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షలతో పాటు.. అణు పరీక్షలను నిర్వహించి ప్రపంచ పెద్దన్నకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఇరాన్ కూడా ఇదేపని చేసింది. 
 
అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. మధ్యంతరశ్రేణి క్షిపణిని తాజాగా విజయవంతంగా పరీక్షిచినట్టు ఇరాన్ ప్రకటించింది. క్షిపణీ పరీక్షలు చేపడితే.. ఇరాన్‌తో చేసుకున్న చారిత్రక అణు ఒప్పందాన్ని రద్దుచేసుకుంటామని అమెరికా హెచ్చరించినా.. ఆ దేశం ఏమాత్రం లెక్కచేయలేదు.
 
శుక్రవారం నిర్వహించిన భారీ ఆయుధ కవాతులో ప్రదర్శించిన ఖోరామ్ షాహ్ర్ క్షిపణిని ప్రయోగిస్తున్న దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ టీవీ శనివారం ప్రసారం చేసింది. అయితే, ఈ క్షిపణిని ఎప్పుడు పరీక్షించారనే వివరాలను టీవీ వెల్లడించలేదు. ఈ క్షిపణిని త్వరలోనే ప్రయోగిస్తామని అధికారులు శుక్రవారం మీడియాకు చెప్పారు.

 

Iran has released footage of the successful test-launch of its new ballistic missile that can hit Israel, a few hours after it was unveiled. pic.twitter.com/Xn4VkRmotZ

— Behind The News (@Behind__News) September 23, 2017

వెబ్దునియా పై చదవండి