ఇరాన్‌లో ఉరిశిక్ష ఖైదీ గుండెపోటుతో మృతి.. అయినా ఉరికంబానికి తగిలించి..?

గురువారం, 25 ఫిబ్రవరి 2021 (16:57 IST)
ఇరాన్‌లో ఉరిశిక్షకు ఊచలు లెక్కపెట్టుకుంటూ  సిద్ధమైన ఒక మహిళ గుండెపోటుతో మరణించింది. ప్రభుత్వ శాసనం ప్రకారం ఆమెను ఉరితీయాల్సిందే అని స్పష్టం చేసిన జైలు అధికారులు ఆమె శవాన్ని ఉరికొయ్యకు వేలాడదీసి, శిక్ష అమలు చేశామని గొప్పలు చెప్పుకున్న వైనం షాక్ కలిగిస్తోంది.
 
వివరాల్లోకి వెళితే.. ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారి అయిన తన భర్తను చంపిన కేసులో జహ్రా ఇస్మాయిలీ అనే మహిళకు ఉరిశిక్ష పడింది. తనను తన కుమార్తెను నిత్యం దూషిస్తూ, వేధిస్తూ ఉండటాన్ని భరించలేకపోయిన ఆ మహిళ చివరకు ఒక రోజు భర్తను చంపేసింది.
 
అయితే ఉరిశిక్ష పడి చావుకు సిద్ధంగా ఉన్న ఆ మహిళ ఉరికంబమెక్కడానికి ముందు గుండెపోటుతో జైలులోనే మరణించింది. చట్టం ప్రకారం ఆమెను ఉరితీయాల్సిందేనని భావించిన ఇరాన్ లోని రజాజ్ షహర్ కారాగారం అధికారులు అప్పటికే చనిపోయిన ఆ మహిళను మళ్లీ ఉరితీసి శిక్ష అమలు చేశామని ప్రకటించుకున్నారు.
 
ఆమె లాయర్ కథనం మేరకు ఉరి శిక్షకు గురైన మరో 16మంది ఖైదీలతో పాటు తన వంతు ఉరికోసం వేచి ఉన్న ఆ మహిళా ఖైదీ తన కళ్లముందే ఆ 16 మంది చనిపోవడం చూసి తట్టుకోలేక గుండెపోటుతో మరణించింది. కానీ ఆమె శవాన్ని అలాగే ఉరికంబం వద్దకు తీసుకెళ్లి మృతదేహాన్ని ఉరితీసి చనిపోయిందని ప్రకటించారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు