ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన ఈ బాలిక, తన ఫోటోను అప్ లోడ్, రీ అప్ లోడ్‌కు 'ఫేస్ బుక్' అనుమతించిందంటూ మండిపడుతోంది. ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ ఫాస్ట్ హైకోర్టును బాధిత బాలిక ఆశ్రయించింది. ఇదే అంశంపై బాలిక తరపు న్యాయవాది మాట్లాడుతూ, ఒక వ్యక్తి ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేసి నగ్నఫొటోను సంపాదించాడని, ఆ ఫొటోను ‘ఫేస్ బుక్’లో అప్‌లోడ్ చేశాడని పేర్కొన్నారు.
ఇటువంటి ఫొటోలను బ్లాక్ చేయాల్సిన ‘ఫేస్ బుక్’ అధికారులు, ఆ విధంగా చేయలేదని అన్నారు. అదే ఫొటోను పలుసార్లు అప్ లోడ్ చేసినా పట్టించుకోలేదని, తన క్లయింట్ పరువుకు నష్టం కల్గించిన ‘ఫేస్ బుక్’ సంస్ధ పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని బాలిక తరపు న్యాయవాది డిమాండ్ చేశారు. అయితే, ఈ ఆరోపణలను ఖండిస్తూ ‘ఫేస్ బుక్’ యాజమాన్యం చేసిన వాదనను హైకోర్టు కొట్టి వేసింది. ఈ కేసు విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.