నకిలీ నోట్ల పంపిణీ సరఫరాదారు.. కాట్మండులో హతం

గురువారం, 22 సెప్టెంబరు 2022 (17:57 IST)
భారత్ లో నకిలీ నోట్లను పంపిణీ చేసే అతి పెద్ద సరఫరాదారు.. పాకిస్థాన్ కు చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటిలెజెన్స్ (ఐఎస్ఐ) ఏజెంట్ నేపాల్ లో హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కాట్మండూలో నక్కిన అతడు తన ఇంటిముందే ఇద్దరు దుండగుల చేతిలో హతమయ్యాడు. సెప్టెంబర్ 19న ఈ ఘటన జరిగినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
 
నిఘా వర్గాల కథనం ప్రకారం.. హతుడు పేరు లాల్‌ మహమ్మద్‌(55). అతడు ఐఎస్‌ఐ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఐఎస్‌ఐ ఆదేశాలకు అనుగుణంగా పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు అక్రమంగా నకిలీ కరెన్సీని సరఫరా చేస్తున్నాడు. 
 
బంగ్లాదేశ్‌, నేపాల్ మీదుగా భారత్‌లోకి నకిలీ నోట్లను తరలిస్తున్నాడు. మహమ్మద్‌కు అండర్‌వరల్డ్ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు చెందిన గ్యాంగ్‌తోనూ సంబంధాలున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 
 
కాట్మండూలో ఉంటున్న అతడిని ఇంటి ఎదుటే ఇద్దరు దుండగులు వెంటాడి కాల్చిచంపారు. తర్వాత వారు ఘటనా స్థలం నుంచి పారిపోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు