పాకిస్థాన్‌కు కొత్త చిక్కు.. శ్రీలంక తరహా దుస్థితి తప్పదా.. పెట్రోల్ ధరలు అప్
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (14:16 IST)
దాయాది దేశానికి కొత్త చిక్కు వచ్చి పడింది. శ్రీలంక తరహాలో ఆర్థిక దుస్థితిని ఎదుర్కొనే రోజులు పాకిస్థాన్‌కు దగ్గరలో వున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మరో రెండు నెలల్లోపు అలాంటి పరిస్థితి ఎదురుకావడం ఖాయమని నిపుణులు చెప్తున్నారు.
మరోవైపు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పాకిస్తాన్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ద్రవ్యోల్భనం దెబ్బతిన్న కారణంగా మరోసారి పాక్ ప్రభుత్వం మరోసారి పెట్రోల్ ధరలను పెంచింది.
బుధవారం లీటర్ పెట్రోల్ పై 1.54 పాకిస్తాన్ రూపాయలను పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ రేట్లు ఆల్ టైం హైకి చేరాయి. లీటర్ పెట్రోల్ ధర పాకిస్తాన్ రూపాయల్లో 237.5కు చేరింది.