దాదాపు ఏడాది పాటు 41 ఏళ్ల పైలట్ డారియో.. టన్నెల్ ఫ్లయింగ్ కోసం ట్రైనింగ్ తీసుకున్నాడు. జివ్‌కో ఎడ్జ్ 540 రేస్ ప్లేన్‌తో అతను ఈ స్టంట్ నిర్వహించాడు. శనివారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఈ ఫీట్ చేపట్టాడు. ఫస్ట్ టన్నెల్ నుంచి అతను తన విమాన రేస్‌ను ప్రారంభించాడు. కోస్టా సుమారు 43.33 సెకన్ల పాటు టన్నెళ్లలో విమానాన్ని నడిపాడు. 1.4 మైళ్ల దూరాన్ని.. టీ1, టీ2 అని పిలిచే టన్నెళ్ల నుంచి ప్రయాణించాడు. ఇస్లాంబుల్ శివారుల్లోని నార్తర్న్ మర్మరా హైవేపై ఆ టన్నెళ్లు ఉన్నాయి.
టన్నెల్ రేస్‌లో పైలట్ డారియో తన విమానంతో అత్యధికంగా 152 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాడు. టన్నెల్ గోడలు, విమానం రెక్క మధ్య 11.5 ఫీట్ల దూరంతో విమానాన్ని నడిపాడు. అయితే తొలి టన్నెల్ దాటి.. రెండవ టన్నెల్‌లోకి ఎంటర్ అవుతున్న సమయంలో.. విమానాన్ని నియంత్రించడం కష్టంగా మారినట్లు పైలట్ చెప్పాడు.