తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని సుమారు 1200 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కింది జ్యోతి. ఈ సంఘటన అమెరికా అధ్యక్షుడు సలహాదారు ఇవాంకా ట్రంప్‌ను ఆకట్టుకుంది. లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి.. స్వంత గ్రామానికి వెళ్లే క్రమంలో జ్యోతి కుమార్ గాయపడ్డ తన తండ్రిని సైకిల్‌పై తీసుకెళ్లింది. జ్యోతి పట్టుదల అందర్నీ ఆకర్షించింది. ఆమె పట్టుదలకు అందరూ సలామ్ కొడుతున్నారు.
ఇవాంకా ట్రంప్ కూడా తన మనసులో మాటను దాచుకోలేకపోయారు. జ్యోతిని ఆమె విశేషంగా కొనియాడారు. జ్యోతి చూపిన అద్భుతమైన ఓర్పు, ప్రేమ.. భారతీయ ప్రజలను, సైక్లింగ్ సమాఖ్యను కట్టపడేసిందని ఇవాంకా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
సైక్లింగ్ ట్రయల్స్‌కు ఆహ్వానించింది. వెనుక ఒకరిని కూర్చోబెట్టుకుని, అంతదూరం ప్రయాణం చేసిన ఆమె శక్తి, సామర్థ్యాలు, తెగువకు ఆశ్చర్యపోయిన సమాఖ్య, గురువారం ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడింది. ట్రయల్స్ కోసం ఢిల్లీకి రావాలని, ట్రయల్స్‌లో సత్తా చాటితే, జాతీయ సైక్లింగ్ అకాడమీలో శిక్షణ ఇస్తామని సమాఖ్య ఛైర్మన్ ఓంకార్ సింగ్ హామీ ఇచ్చారు.