సామాన్యుడు ప్రేమకోసం రాజరికాన్ని కోల్పోయిన యువరాణి

మంగళవారం, 30 అక్టోబరు 2018 (15:59 IST)
జపాన్ దేశ చట్టాల మేరకు ఆ దేశ రాజవంశీయులు ఎవరైనా సామాన్యులను ప్రేమిస్తే తమ రాజరికాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అలాగే, చేసింది ఆ దేశ యువరాణి అయాకో (28). ఆమె కియ్ మోరియా (32) అనే సామాన్యుడుని ప్రేమించింది. అతనికోసం ఎలాంటి త్యాగమైన చేయడానికి నిర్ణయించుకుంది. 
 
ఈ నేపథ్యంలో తాను ప్రేమించిన కియ్ మోరియా కోసం యువరాణి రాజకుటుంబీకులను వదిలివేసింది. జపాన్ దేశ నిబంధనల ప్రకారం రాజవంశపు స్త్రీలు సామాన్యుడిని పెళ్లి చేసుకుంటే తమ రాజరికాన్ని శాశ్వతంగా కోల్పోవాల్సి ఉంటుంది. 
 
పెళ్లి తర్వాత సామాన్యురాలిగా పరిగణించడంతో పాటు ఆమె వారసులకు సింహాసనంపై హక్కు ఉండదు. అయినా అయాకో తన ప్రేమను వదులుకోలేదు. ఓ షిప్పింగ్‌ కంపెనీ ఉద్యోగి కియ్‌ మోరియాను రాజకుటుంబం పవిత్రంగా భావించే టోక్యోలోని మెయిజీ ఆలయంలో పెళ్లి చేసుకుంది. దీంతో అయాకో ప్రేమ కథకు శుభంకార్డు పడింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు