'మగధీర' విడుదలైన సమయంలో ఎస్‌ఎస్ రాజమౌళికి జపాన్‌లో ఉన్న క్రేజ్ తక్కువే. అయితే 'బాహుబలి' విడుదలైన తర్వాత ఒక్కసారిగా జక్కన్న పేరు జపాన్‌తోపాటు వివిధ దేశాల్లో మార్మోగిపోయింది. జపాన్‌లో రాజమౌళి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని 'మగధీర' సినిమాను అక్కడ మళ్లీ విడుదల చేశారు నిర్మాతలు. ఈ సినిమా కేవలం 10 రోజులలో సుమారుగా రూ.17 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు అంచనా వేశారు.
రామ్ చరణ్ నటించిన 'మగధీర' చిత్రానికి లభిస్తున్న ఇంతటి ఆదరణ గురించి తెలుసుకున్న మన కాలభైరవ(మెగా పవర్ స్టార్ రామ్ చరణ్) ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు. "థాంక్యూ జపాన్.. మాపై మీరు చూపిస్తున్న ప్రేమని చూస్తుంటే నిజంగా ఆనందంగా అనిపిస్తోంది. ఇది ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతుంది. ఇలాంటి చిరస్మరణీయమైన సినిమాను నాకిచ్చినందుకు రాజమౌళిగారికి చాలా పెద్ద థాంక్యూ. ఇప్పటికీ ఈ సినిమా వచ్చి 10 సంవత్సరాలైందంటే నమ్మలేకపోతున్నా" అని తెలిపాడు.