బ్రిటన్ మహిళా ఎంపీ జో కాక్స్ దారుణ హత్య.. మూడుసార్లు కాల్పులు.. ఆపై కత్తితో..?

శుక్రవారం, 17 జూన్ 2016 (12:14 IST)
ప్రముఖ బ్రిటన్ మహిళా ఎంపీ జో కాక్స్‌ దారుణంగా హత్యకు గురైయ్యారు. అదీ సొంత నియోజకవర్గంలోనే ఆమె దారుణంగా హత్యకు గురికావడం పెను సంచలనం సృష్టించింది. లేబర్ పార్టీ తరపున వెస్ట్ యార్క్‌షైర్‌లోని బ్యాట్లీ అండ్ స్పెన్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన ఆమె బ్రిటన్ యూరోపియన్ యూనియన్‌లోనే కొనసాగాలని వాదానికి గట్టిగా మద్దతు తెలపడంతో.. ఆమె హత్య రాజకీయా వర్గాల్లో అందరినీ షాక్‌కు గురిచేసింది.
 
గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ హత్య చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బిర్‌స్టాల్‌ పట్టణంలో ఆమెపై ఓ దుండగుడు మూడుసార్లు కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె తల్లోకి బుల్లెట్ దిగడంతో.. కిరాతకంగా కత్తితో కూడా దాడి చేశాడు. ఇద్దరు పిల్లల తల్లి అయిన 41 ఏళ్ల కాక్స్‌ సంఘటన స్థలంలోనే కుప్పకూలింది. ఈమె హత్యకు గల కారణాలపై పోలీసులు శరవేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి