అసాంజే మామూలోడు కాదు.. ఎంబసీలోనే దుకాణం.. ఇద్దరు బిడ్డలకు తండ్రయ్యాడు...

ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (10:32 IST)
వికీలీక్స్ వ్యవస్థాపకుడు, లైంగిక ఆరోపణల నేపథ్యంలో కొన్నేళ్ళపాటు లండన్‌లోని ఈక్వెడార్ ఎంబీసీ ఆశ్రయం పొందిన జూనియన్ అసాంజే మామూలోడు కాదు. తాను ఆశ్రయం పొందిన ఎంబసీలోనే రాసలీలలు కొనసాగించాడు. ఒక మహిళ న్యాయవాదిని బుట్టలో వేసుకున్నాడు. ఫలితంగా అసాంజే ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. ఇపుడు అతని చేతిలో మోసపోయిన ఆ మహిళ మీడియా ముందుకు వచ్చింది. తాను అసాంజే భాగస్వామిగా చెప్పుకుంటున్న ఆమె వీడియో ఇపుడు వికీలీక్స్‌తో పాటు డెయిలీ మెయిల్ పోస్ట్ చేసింది. ఆ మహిళా న్యయావాది పేరు స్టెల్లా మోరిస్. 
 
ఈ వీడియోలో ఆమె చెబుతున్న వివరాల మేరకు.. అసాంజే కారణంగా ప్రస్తుతం రెండేళ్ల వయసున్న గాబ్రియేల్, ఏడాది వయసున్న ఓల్ట్ మాక్స్‌కు జన్మనిచ్చాను. గత యేడాది ఈక్వెడార్ ఎంబసీ అసాంజేను ఎంబసీ నించి బయటకు గెంటేసిన తర్వాత... లండన్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. 
 
స్వీడన్ జాతీయురాలినైన తాను.. బ్రిటన్‌లో నివాసం ఉంటున్నాను. 2011లో తాను అసాంజేను తొలిసారిగా కలిశానని, ఆ సమయంలోనే ఆయనతో ప్రేమలో పడ్డానని, ఆపై అతని అంతర్జాతీయ న్యాయవాదుల బృందంలో చేరానని చెప్పింది. అసాంజేకు న్యాయవాదిగానూ వ్యవహరించాను. 
 
అప్పటి నుంచి ఎంబసీలో అతనితోనే ప్రతినిత్యం కలిసివున్నట్టు తెలిపింది. ఈ ప్రపంచంలో అసాంజే గురించి తనకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అసాంజే ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆయన మానసికంగా కుంగిపోయారని, ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఉన్నాయని చెప్పారు. 
 
పైగా, లండన్ జైల్లో కరోనా మహమ్మారి వ్యాప్తిపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతోనే తాను తమ మధ్య ఏర్పడిన బంధంపై మాట్లాడుతున్నానని వివరించారు. వెంటనే విడుదల చేయకుంటే, ఆయన తన జీవితాన్ని ముగించినట్టేనని తనకు అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు.
 
అయితే, మోరిస్ వెల్లడించిన విషయాలపై ఈక్వెడార్ ఎంబసీ ఇంతవరకూ స్పందించలేదు. వికీలీక్స్‌గానీ, అసాంజే లాయర్ కూడా అధికారికంగా ఎటువంటి వివరణా ఇవ్వలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు