గంటల్లో ఇంటి నిర్మాణం పూర్తి.. సకల సదుపాయాలతో... అబ్బురపరుస్తున్న స్టార్టప్ (వీడియో)

మంగళవారం, 21 జూన్ 2016 (12:10 IST)
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసిచూడు.. అని మన పెద్దలు అన్నారు. కానీ ఓ సినీ కవి మాత్రం... పెళ్లి చేసుకుని, ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలోయ్ అని తన బాణీలో చెప్పుకొచ్చాడు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఓ ఇంటి నిర్మాణం చేపట్టాలంటే తలకుమించిన భారంగా మారింది. నిర్మాణ ఖర్చులతో పాటు.. భవన నిర్మాణ కార్మికుల కూలీలు అమాంతం పెరిగిపోయాయి. అందుకే ఇపుడు ఇంటి నిర్మాణం కష్టసాధ్యంగా మారింది. 
 
ఇలాంటి కష్టం నుంచి విముక్తి కల్పించేందుకు ఓ స్టార్టప్ కంపెనీ భావించింది. ఇందుకోసం సరికొత్త ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆస్ట్రేలియాకు చెందిన కడెగో అనే కంపెనీ హ్యూమనీహట్ షెల్టర్ సిస్టమ్ పేరుతో ఈ ఇంటిని డిజైన్ చేసింది. పిండికొద్దీ రొట్టె అన్నట్టు... పెట్టిన ఖర్చును అనుసరించే ఆ ఇంట్లో సౌకర్యాలు కూడా కల్పించనుంది. ఈ ఇల్లు ప్రకృతి విపత్తులు సంభవించినపుడు, శరణార్ధులకు ఆశ్రయం కల్పించడం వంటి సమయాల్లో ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ ఇంటి నిర్మాణం ఎలా చేపడుతారో కూడా ఓ వీడియోను తీసి ప్రసార మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తోంది.
 

వెబ్దునియా పై చదవండి