దక్షిణ లెబనాన్‌లోని పాలస్తీనా రెఫ్యూజీ క్యాంపులో భారీ పేలుడు సంభవించింది. లెబనాన్ దేశంలోని టైర్ అనే నగరంలో శనివారం భారీ పేలుడు సంభవించింది.
ఈ పేలుడులో దాదాపు 12 మందికి పైగా తీవ్రగాయాల పాలయ్యారని 27మంది మరణించారని స్థానిక మీడియా తెలిపింది.
ఈ పేలుడు దక్షిణ లెబనాన్‌లోని ఓ పాలస్తీనా రెఫ్యూజీ క్యాంప్‌లో జరిగింది. లెబనాన్‌లో పలు పాలస్తీనా శిబిరాలు ఉన్నాయి. వాటిలో బుర్జ్ అల్ షెమాలీ క్యాంప్‌లో ఈ పేలుడు సంభవించింది. ఈ శిబిరం హమాస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఉంది.
ఆ క్యాంప్‌లోని హమాస్ ఆయుధాల నిలువ గదిలో ఈ పేలుడు జరిగిందని, ఇప్పటికిదాకా పేలుడు గల కారణాలు స్పష్టంగా తెలియ రాలేదు.