బీరూట్‌లో ఎమెర్జెన్సీ.. లెబనాన్ పార్లమెంట్ ఆమోదం

శుక్రవారం, 14 ఆగస్టు 2020 (09:43 IST)
బీరూట్‌లో ఆగస్టు 4న భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఘటనకు బాధ్యత వహిస్తూ లెబనాన్‌ క్యాబినెట్‌ రాజీనామా చేసింది.
 
అయితే అంతకుముందే ఆగస్టు 5న బీరూట్‌లో రెండువారాల పాటు ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా బీరూట్‌లో ఎమర్జెన్సీ విధించడానికి లెబనాన్‌ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై గురువారం లెబనాన్‌ పార్లమెంటులో ఓటింగ్‌ జరిగింది. ఎమర్జెన్సీకి పార్లమెంటు ఆమోదం తెలుపడంతో సైన్యానికి అపరిమిత అధికారాలు వచ్చాయి. ప్రజాగ్రహాన్ని అణచివేయడానికే ఎమర్జెన్సీ విధించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు