లిబియా ప్రధానమంత్రి అబ్దుల్ హమీద్ నివాసంపై రాకెట్ దాడి...

ఠాగూర్

మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (11:20 IST)
లిబియా ప్రధానమంత్రి అబ్దుల్ హమీద్ నివాసంపై రాకెట్ దాడి జరిగింది. గత 2011 నుంచి లిబియాలో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ ప్రాంతం తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా విడిపోయి పాలన సాగుతుంది. 2014లో అబ్దుల్ హమీద్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది. అయితే, ఈ ప్రభుత్వాన్ని తూర్పు ప్రాంత పార్లమెంట్ గుర్తించలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దబేజా నివాసంపై సోమవారం రాకెట్ గ్రనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో భవనం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని మంత్రి ఒకరు తెలిపారు. ఈ రాకెట్ దాడితో అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రధాని నివాసం వద్ద భారీగా మొహరించాయి. 
 
2011 నుంచి లిబియాలో రాజకీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. పాలన కూడా రెండు వర్గాల చేతుల్లో ఉంది 2014లో తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా విడిపోయిన వర్గాలు ఎవరికి వారే పాలించుకుంటున్నారు. సమస్యను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఐక్యరాజ్య సమితి 2021లో అబ్దుల్ హమీద్ నేతృత్వంలోని నేషనల్ యూనిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, తూర్పు ప్రాంతంలోని పార్లమెంట్ ఆయనను అధికారికంగా గుర్తించేందుకు నిరాకరించడంతో లిబియా దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు