ఇజ్రాయెల్ రూటు మారింది.. యెమెన్‌పై యుద్ధం.. హసన్ నస్రల్లా హతం (video)

సెల్వి

బుధవారం, 2 అక్టోబరు 2024 (11:18 IST)
Yemen
ఇజ్రాయెల్ తన రూటు మార్చింది. దాడుల తీవ్రతను మరింత పెంచింది. లెబనాన్‌పై రెండు వారాలుగా నిప్పుల వర్షం కురిపించింది. అంతేగాకుండా దాన్ని పొరుగు దేశాలకు విస్తరింపజేసింది. ఇక కొత్తగా యెమెన్‌పై యుద్ధానికి దిగింది. 
 
మిస్సైళ్లు, బాంబుల వర్షాన్ని కురిపించింది. ఈ క్రమంలో బీరూట్‌ దక్షిణ ప్రాంతంపై సాగించిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా హతం అయ్యారు. ఆయనతో పాటు సదరన్ ఫ్రంట్ కమాండర్ అలీ కర్కీ, ఇతర కమాండర్లు కూడా మృతి చెందారు. 
 
హెజ్బొల్లాకు కంచుకోటగా భావించే దహియా ప్రాంతాన్ని నేలమట్టమైంది. తాజాగా తన దాడులను యెమెన్‌కు విస్తరించింది ఇజ్రాయెల్. హౌతీ స్థావరాలపై విరుచుకుపడుతోంది. 
 
హౌతీ ఆధీనంలో ఉన్న పోర్టులు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు సాగాయి. ఈ ఘటనలో10 మంది సాధారణ పౌరులు మరణించారు.

Amid rising tensions in the Middle East, discussions of a #SurgicalStrike by #Israel are intensifying. With regional instability exacerbated by conflicts in #Yemen, and the roles of #BasharAlAssad and #MaherAlAssad in Syria further complicating the landscapes. pic.twitter.com/sWovEqGuZd

— Prashant Sharma (@Im_prashant_26) September 30, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు