ఇండోనేషియాను కుదిపేసిన వరుస భూకంపాలు

ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (09:44 IST)
ఇండోనేషియాను వరుస భూకంపాలు కుదిపేశాయి. ఆదివారం తెల్లవారుజామున రెండు వరుస భూకంపాలు సంభవించాయి. తొలి భూకంపం కేపులాన్ బటులో 6.1 తీవ్రతతో సంభవించగా, ఆ తర్వాత గంటల వ్యవధిలోనే రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ మేరకు యూరోపియన్ మేడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది.
 
తొలి భూకంపం కేంద్రాన్ని భూమికి అడుగు భాగంలో 43 కిలోమీటర్ల, రెండోది 40 కిలోమీటర్లు లోతున సంభవించినట్టు వెల్లడింది. అయితే, ఈ రెండు భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించింది.కాగా, గత బుధవారం కూడా ఇండోనేషియాలో భూకంపం సంభించిన విషయం తెల్సిందే. సబాంగ్‌కు నైరుతి దిశగా 16 కిలోమీటర్ల దూరంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు