ఇండోనేషియలోని ప్రధాన ద్వీపం జావా పశ్చిమ భాగంలో సోమవారం సంభవించి భారీ భూకంపం ధాటికి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఆరంభంలో కేవలం 46 మంది మాత్రమే చనిపోయినట్టు ఇండోనేషియా అధికారులు ప్రకటించారు. కానీ, ఇపుడు ఈ సంఖ్య 268కి పెరిగింది. సియాంజర్ పట్టణానికి సమీపంలోని 5.6 తీవ్రతతో ప్రకంపనలు రాగా భారీ నష్టం వాటిల్లిన విషయం తెల్సిందే.
సహాయక చర్యల్లో నిమగ్నమైవున్న అధికారి ఒకరు మాట్లాడుతూ, ఈ భూకంపం వల్ల మరణించిన వారిలో అత్యధికులు చిన్నారులేనని వెల్లడించారు. విద్యార్థులు స్కూల్లో ఉండగా భూకంపం సంభవించడంతో ప్రాణనష్టం అధికంగా జరిగినట్టు భావిస్తున్నారు.