నోబెల్ అవార్డు గ్రహీత, మలాలా యూసుఫ్ జాయ్ కొత్త లుక్‌తో కూడిన ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మలాలా అనగానే సంప్రదాయ ముస్లిం వస్త్రాల్లో.. తల మీద వస్త్రం ధరించి కనిపిస్తుంది. అలాంటి మలాలా ఒక్కసారిగా జీన్స్, హై హీల్స్ వేసి కనిపించిన ఫోటోను చూసి పాకిస్థానీయులు ఫైర్ అవుతున్నారు.
ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న మలాలా, సాధారణ యువతిలా జీన్స్, జాకెట్ ధరించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాలికల విద్య కోసం పోరాడి నోబెల్ సాధించిన ఆమె స్కిన్నీ జీన్స్, హై హీల్స్, బాంబర్ జాకెట్ ధరించడాన్ని పాకిస్థానీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఫొటోనే వైరల్‌గా షేర్ చేస్తూ నానా రకాల కామెంట్లు చేస్తున్నారు.
కానీ మలాలా డ్రెస్ కోడ్‌పై పాకీస్థానీయులు చేసే కామెంట్లను ఇతర దేశాల నెటిజన్లు తిప్పికొడుతున్నారు. పాకిస్థానీయులు మలాలాను నటి మియా ఖలీఫాతో పోల్చారు. ఇలాంటి డ్రెస్‌లు ధరిస్తే పాకిస్థాన్‌కు త్వరలోనే భూకంపం వస్తుంది. అంతేగాకుండా ఇకపై తలపై వస్త్రం వదిలించుకునే రోజులు కూడా దగ్గర్లో వున్నాయంటూ రకరకాల కామెంట్లు చేశారు. మలాలాకు పిచ్చిపట్టిందని.. దేశం పరువు తీసిందని మరికొందరు దుయ్యబట్టారు.