అమెరికాలోని ఫ్లోరిడా నగరాన్ని ఇర్మా తుఫాను ముంచెత్తింది. ఈ విధ్వంసకర, భయంకర తుఫాను ధాటికి ఫ్లొరిడా నగరం మునిగిపోయినంత పని అయింది. ఎక్కువ తీవ్రతలేని ప్రాంతాల్లోని ప్రజలను ఇళ్లలోనే ఉండాలని.. బయటకు రావొద్దని ప్రజలను అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఫ్లోరిడా వాసుల్లో ఒకరు అతి భయంకరమైన ఇర్మా తుఫానును లెక్క చేయకుండా కొంతమంది బయటికి వెళ్లి ఇర్మా సముద్రపు అలలను తమ కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. అలాంటి వారిలో ఓ వ్యక్తి సముద్ర తీరం ఒడ్డున నిలబడి వీడియో తీస్తుండగా, ఉవ్వెత్తున ఎగిసిపడిన అలల ధాటికి తట్టుకోలేక అక్కడే కింద పడిపోయాడు. తర్వాత లేచి ఎందుకొచ్చిన గొడవరా బాబు.. అని అనుకున్నాడో ఏమో.. అటూ ఇటూ చూసి తిన్నగా అక్కడ నుంచి జారుకున్నాడు.