మంచినీళ్లు ఇవ్వలేదని కట్టుకున్న భార్యపై దాడిచేసాడో కసాయి. భోజనం చేస్తుండగా అడిగిన వెంటనే నీళ్లు ఇవ్వలేదన్న కోపంతో భార్యపై విచక్షణరహితంగా దాడిచేశాడు. రెండేళ్ల కొడుకు చూస్తుండగా కత్తి తీసుకుని వందసార్లకుపైగా ఆమెను పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు (19) అతడి నుండి బారినుంచి తప్పించుకునేందుకు చనిపోయినట్టు నటించింది. కాసేపటి తర్వాత ఇంట్లోంచి బయటపడిన ఆమె దగ్గరలో నిల్చున్న బస్సులోకి ఎక్కింది. బస్సులో అపస్మారకస్థితిలో పడి ఉన్న బాధితురాలిని గుర్తించిన డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు.