మిమ్మల్మే విజేతగా ఎందుకు ఎన్నుకోవాలని అని ప్రశ్నించగా.... తనలాంటి శరీర ఛాయ కలిగిన స్త్రీలను అందాలభామలుగా పరిగణించని లోకంలో ఎదిగానని, ఈరోజుతో ఆ భావనకు ముగింపు పలకాలని భావిస్తున్నానని ఆత్మవిశ్వాసంతో ఆమె పలికిన మాటలు న్యాయనిర్ణేతలను మెప్పించాయి. దీంతో ఆమెను విశ్వ విజేతగా జడ్జీలు ప్రకటించారు. ఫలితంగా ఆమెకు 2018 మిస్ యూనివర్శ్‌గా నిలిచిన కర్టియోనా గ్రే కిరీటం బహుకరించింది.
ఇకపోతే, ఈ పోటీల రన్నరప్‌గా మిస్ మెక్సికో సోఫియా ఆరగాన్, మిస్ ప్యూర్టోరికా మాడిసన్ ఆండర్సన్ నిలిచారు. కాగా, భారత్ నుంచి మిస్ యూనివర్స్ పోటీలకు వెళ్లిన మిస్ ఇండియా వర్తికా సింగ్ కనీసం టాప్-20లో కూడా స్థానం దక్కించుకోలేకపోయింది. ఈ అందాల పోటీలు అమెరికాలోని అట్లాంటాలో నిర్వహించారు.