'మిస్ వరల్డ్ 2021' ఫైనల్ పోటీలు వాయిదా: 'మిస్ ఇండియా' తెలంగాణ మానసకు కరోనా

శుక్రవారం, 17 డిశెంబరు 2021 (17:56 IST)
ప్యూర్టోరికోలో జరగాల్సిన 'మిస్ వరల్డ్ 2021' ఫైనల్ పోటీలు తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ పోటీలకు కరోనా వైరస్ సెగ తగిలింది. దీంతో ఈ పోటీలను వాయిదా వేశారు. అదేసమయంలో ఈ ఫైనల్ పోటీలకు ఎంపికైన అందాల భామలను ఐసోలేషన్‌కు తరలించారు. అయితే, ఈ పోటీలను 90 రోజుల్లో నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. 

 
ఈ ఫైనల్ పోటీలు ప్రారంభానికి కొన్ని గంటల ముందు కరోనా వైరస్ కలకలం రేపింది. అందుకే ఈ పోటీలను వాయిదావేసినట్టు మిస్ వరల్డ్ నిర్వాహకులు వెల్లడించారు. కరోనా వైరస్ బారినపడుతున్న కంటెస్టంట్ల సంఖ్య పెరుగుతుండటంతో ఈ పోటీలను వాయిదా వేయాల్సిన నిర్బంధ పరిస్థితి వచ్చిందని నిర్వాహకులు వెల్లడించారు. 

 
కాగా, ఈ పోటీలకు హాజరయ్యే వారిలో 16 మంది కంటెస్ట్ంట్స్, స్టాఫ్ మెంబర్లు కరోనా వైరస్ బారినపడ్డారు. వీరందరికీ నిర్వహించిన వైద్య పరీక్షల్లో కోవిడ్ నిర్ధారణ అయింది. ఈ వైరస్ బారినపడిన వారిలో 'మిస్ ఇండియా 2020' మానస వారణాసి కూడా ఉన్నారు. ఈ పోటీల్లో భారత్ తరపున మానస పోటీపడుతున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు