న్యూజిలాండ్‌లోని తరానకి పర్వతాన్ని మౌరి తెగకి చెందిన ప్రజలు పవిత్ర ప్రాంతంగా భావిస్తారు. ఆ కొండను పితృదేవతులుగా భావిస్తారు. అలాంటి కొండపై ఎక్కడానికి కూడా ఆ ప్రాంత వాసులు సాహసించరు. అలాంటిది 8,300 అడుగుల ఎత్తుగల ఈ కొండపై జెలీన్ కుక్ అనే మోడల్ ఎక్కేసింది. ఎక్కడంతో ఆపకుండా నగ్నంగా నిలబడి ఫోటోకు ఫోజిచ్చింది. ఆ ఫోటోను కాస్త ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేసింది.
క్లౌజ్, టైనర్స్ మాత్రేమే ధరించి కుక్ అలా కొండపై నిలబడటంపై మౌరీ ప్రజలు మండిపడుతున్నారు. ప్లేబాయ్ ఫేమ్ కుక్ తన బాయ్ ఫ్రెండ్ జోష్ షాతో కలిపి కొండెక్కిందని.. ఎలాంటి అనుమతి లేకుండా ఈ పని చేయడంపై ఆ ప్రాంత వాసులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ ఫోటోలు 28వేల లైక్స్ వచ్చాయి. అయితే న్యూజిలాండ్ ప్రభుత్వం కూడా ఆ పర్వత పవిత్రను ఎత్తిచూపడంతో మౌరి ప్రజలకు కుక్ క్షమాపణలు చెప్పింది.