ముంబై తీవ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ దోషి... పాకిస్తాన్ పంజాబ్ కోర్టు

బుధవారం, 7 ఆగస్టు 2019 (14:33 IST)
ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసులో పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ గుజ్రాన్‌వాలా నగరంలోని కోర్టు బుధవారం ముంబై తీవ్రవాద దాడుల సూత్రధారి, జమత్-ఉద్-దావా (జుడి) చీఫ్ హఫీజ్ సయీద్‌ను దోషిగా ప్రకటించింది. నివేదికల ప్రకారం సయీద్ కేసును పాకిస్తాన్ లోని గుజరాత్‌కు మార్చారు.

భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకరైన సయీద్‌ను ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుకు సంబంధించి జూలై 17న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు తరువాత, సయీద్‌ను ఏడు రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌లో జైలుకు పంపారు.
 
ఆ తర్వాత జూలై 24న, తీవ్రవాద నిరోధక విభాగం ప్రత్యేక ఉగ్రవాద నిరోధక న్యాయమూర్తి సయ్యద్ అలీ ఇమ్రాన్ తన దర్యాప్తును ముగించి, ఆగస్టు 7న, అంటే ఈ రోజు కోర్టులో అధికారిక చలాన్‌ను సమర్పించాలని కోరారు.
 
హఫీజ్ సయీద్‌ను ఎందుకు అరెస్టు చేశారంటే... ఉగ్రవాద నిరోధక చట్టం, 1997 ప్రకారం టెర్రర్ ఫైనాన్సింగ్, మనీలాండరింగ్ కేసులలో హఫీజ్ సయీద్‌తో సహా టాప్ లిస్టులో వున్న 13 మంది తీవ్రవాద నాయకులపై సిటిడి బుక్ చేసింది. పంజాబ్ లోని ఐదు నగరాల్లో ఉగ్రవాద నిరోధక విభాగం కేసులు నమోదు చేసింది. అరెస్టుకు ముందే బెయిల్ పొందే ఉద్దేశ్యంతో ఉగ్రవాద నిరోధక కోర్టుకు హాజరు కావడానికి లాహోర్ నుండి గుజ్రాన్‌వాలాకు వెళ్లే సమయంలో అతనిపై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్న సయీద్‌ను సిటిడి అదుపులోకి తీసుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు