అంతరిక్షం నుంచి స్నేహితురాలి బ్యాంకు ఖాతా హ్యాక్.. వ్యోమగామిపై కేసు

ఆదివారం, 25 ఆగస్టు 2019 (10:32 IST)
చరిత్రలోనే తొలిసారిగా వ్యోమగామిపై ఓ కేసు నమోదైంది. అంతరిక్షం నుంచి తన స్నేహితురాలి బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసిందన్న అభియోగంపై ఈ కేసు నమోదైంది. ఇదే అంశంపై న్యూయార్క్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 
 
ఈ వివరాలను పరిశలిస్తే, సుమ్మర్ వార్డెన్ అనే వ్యోమగామి అంతర్జాతీయయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఐఎస్ఎస్)కు వెళ్లింది. అక్కడ నుంచే తన మాజీ సహచరురాలు అన్నే మెక్ క్లెయిన్ బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న క్లెయిన్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. 
 
మెక్ క్లయిన్‌పై గుర్తింపు చోరీ, అనధికారంగా ఖాతాలోకి చొరబాటు అభియోగాలపై కేసు నమోదైంది. నాసా అధీనంలోని కంప్యూటర్ల నుంచి తన ఖాతాను హ్యాక్ చేశారని వార్డెన్ ఫిర్యాదు చేశారు. తాను ఐఎస్ఎస్‌లో పని చేస్తున్న వేళ, కొన్నిసార్లు ఖాతాను తెరచానని, ఆ వివరాలను తెలుసుకున్న వార్డెన్, తన ఖాతాను హ్యాక్ చేశాడన్న ఆమె ఆరోపణలపై ఇప్పుడు అధికారులు ఫిర్యాదు చేశారు. 
 
తాను, సుమ్మర్ వార్డెన్‌తో కలిసి ఆరు నెలల పాటు ఐఎస్ఎస్‌లో పని చేశామన్నారు. కాగా, ఆమె చేసిన ఆరోపణలను ఐఎస్ఎస్ ఉన్నతాధికారులు తిరస్కరిస్తుండటం గమనార్హం. డిసెంబర్ 3, 2018న సూయజ్ రాకెట్‌లో మెక్ క్లయిన్ ఐఎస్ఎస్‌కు వెళ్లి, తన సహచరుడు నిక్ హాగ్‌తో కలిసి తొలిసారి స్పేస్ వాక్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు