ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

ఠాగూర్

సోమవారం, 14 ఏప్రియల్ 2025 (14:51 IST)
సాధారణంగా జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాహన బీమా, ప్రమాద బీమా ఇలా పలు రకాలైన బీమాలు మన దేశంలో అందుబాటులో ఉన్నాయి. కానీ ఓ యువకుడు మాత్రం వినూత్నంగా ఆలోచన చేసి ప్రేమ బంధానికి కూడా ఓ బీమా పాలసీని తీసుకొచ్చాడు. "జికీలవ్" పేరుతో ఈ పాలసీని తీసుకొచ్చానని చెబుతున్నాడు. అయితే, ఈ పాలసీ తీసుకునే ప్రేమజంటలకు ఓ షరతు విధించాడు. 
 
ఈ పాలసీ తీసుకున్న ప్రేమికులు ఐదేళ్ళపాటు క్రమం తప్పకుండా ప్రీమియం చల్లించాల్సివుంటుంది. ఆ తర్వాత ఎపుడు వివాహం చేసుకున్నా పెద్ద మొత్తంలో సొమ్ము తిరిగి చెల్లిస్తానని తెలిపారు. ఐదేళ్శపాటు క్రమం తప్పకుండా చెల్లించిన ప్రీమియం మొత్తానికి పది రెట్లు అధికంగా, అంటే రూ.లక్షల్లో తిరిగి అందుకోవచ్చని చెబుతున్నారు. 
 
అయితే, ప్రేమబంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లిన జంటలకే ఈ బీమా మొత్తం అందుకునే అవకాశం ఉంటుందని, మధ్యలో విడిపోయిన జంటలకు ఒక్క పైసా కూడా తిరిగి ఇవ్వనని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం ప్రేమించుకుంటున్న జంటల్లో పెళ్లిపీటలు ఎక్కేవాళ్లు అతి తక్కువ మందే ఉంటున్నారు. కారణాలు ఏవైనా చాలామంది ప్రేమికులు ఒకటి రెండేళ్లకు మించి తమ బంధాన్ని నిలుపుకోవడం లేదు. ఈ పరిస్థితి మార్చడమే తన లక్ష్యమని, అందుకే జికీ లవ్ పేరుతో బీమా పాలసీని తీసుకొచ్చానని చెబుతున్నాడు. అయితే, నెటిజన్లు మాత్రం జికీలవ్ ఇన్సూరెన్స్ పాలసీపై పలు విధాలుగా తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు