చికిత్స చేసిన కరోనా రోగుల మృతి... చూసి తట్టుకోలేక వైద్యురాలి బలవన్మరణం

మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (16:14 IST)
తాను చికిత్స చేసిన కరోనా రోగులు వరుసగా మరణించడాన్ని ఆమె తట్టుకోలేక పోయింది. వారి మృతులు ఆమెను కలసివేసింది. దీంతో ఆ మహిళా వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన అమెరికాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కరోనా వైరస్ బారిన నగరాల్లో న్యూయార్క్ ఒకటి. ఈ నగరాన్ని కరోనా వైరస్ అల్లకల్లోలం చేసింది. వేలాది మంది ప్రజలు ఈ వైరస్ బారినపడ్డారు. వందలామంది మృత్యువాతపడ్డారు. 
 
అయితే, ఈ నగరంలోని ఓ ఆస్పత్రిలో లార్నా ఎం బిర్నా అనే 49 యేళ్ల మహిళ వైద్యురాలిగా మన్ ‌హట్టన్‌ న్యూయార్క్‌ అలెన్‌ హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగం మెడికల్‌ డైరెక్టర్‌ గా పనిచేస్తోంది. ఆమె పని చేస్తున్న ఆస్పత్రిలో అనేక మంది కరోనా రోగులను చేరారు. 
 
వారికి ఆమె చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమె ఎంతోమందికి కరోనా బాధితులకు చికిత్స చేసింది. వారిలో కొందరి పరిస్థితి విషమించి, చనిపోవడాన్ని బిర్నా తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె తండ్రి వెల్లడించారు. 
 
ఆత్మహత్యకు పాల్పడే ముందు బిర్నా తనతో మాట్లాడిందని గుర్తు చేసుకున్న ఆయన, తనలో ఎటువంటి మానసిక సమస్యలూ లేవని, కరోనా సోకిన రోగులను అంబులెన్స్ లోకి ఎక్కించే ముందే వారు మరణిస్తుంటే తట్టుకోలేకున్నానని చెప్పి భావోద్వేగానికి లోనైందని వెల్లడించారు. 
 
కరోనా రోగులను అటెండ్ చేసిన బిర్నాకు కూడా వైరస్ సోకిందని, వైరస్‌పై ఎంతో పోరాటం చేసి విజయం సాధించిన ఆమె, తిరిగి విధుల్లోకి చేరిందని తెలిపారు. ఇంతలోనే ఘోరానికి పాల్పడుతుందని ఊహించలేదని ఆయన న్యూయార్క్ టైమ్స్‌కు చెబుతూ బోరున విలపించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు