సాధారణంగా భూమి కంపిస్తుందంటే ప్రాణభయంతో పరుగులు తీస్తాం. కానీ, న్యూజిలాండ్ దేశ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ మాత్రం... టీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో భూమి కంపించింది. ఇది రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. అయినప్పటికీ ఆమె ప్రాణభయంతో ఇంటర్వ్యూను మధ్యలో ఆపేసి పారిపోలేదు. పైగా, తన ఇంటర్వ్యూను కంటిన్యూ చేశారు. భూప్రకంపనలకు భయపడేందుకు తానేమీ వేలాడే లైట్ల కిందలేను అని చెప్పుకొచ్చారు.
టీవీ హోస్ట్ ర్యాన్ బ్రిడ్జ్.. కాసేపు ప్రధాని మాటలు విని.. మీరు ఓకేనా.. భూకంపం ఆగిందా? అని అడిగారు. అప్పుడు ప్రధాని జెసిండా షో కంటిన్యూ చేసేందుకు అంగీకరిస్తూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. చాలా స్వల్ప భూకంపం వచ్చినట్లు ఉందని, చాలా డీసెంట్ ప్రకంనలు వచ్చినట్లు లైవ్ షోలోనే ప్రధాని జెసిండా తెలిపారు.
వెల్లింగ్టన్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లెవిన్ పట్టణంలో భూకంప కేంద్ర నమోదైంది. లైవ్ షోలో చిన్న చిరునవ్వు ఇస్తూనే.. ఇక్కడ స్వల్ప భూకంపం నమోదు అయినట్లు జెసిండా తెలిపారు. ఇంటర్వ్యూ కొనసాగించేందుకు తనకు ఇబ్బంది లేదని, తానేమీ వేలాడే లైట్ల కింద లేను అని, చాలా బలమైన నిర్మాణం కింద ఉన్నట్లు ప్రధాని తెలిపారు.