ఇకపోతే.. ఎంఫాన్ తుపాను పశ్చిమ బెంగాల్‌లోని డిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య సుందర్‌బన్స్‌కు సమీపంలో తీరం దాటింది. తీరం దాటే సమయంలో బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో గంటకు 155 నుంచి 165, అప్పుడప్పుడు 190 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయని అధికారులు తెలిపారు. పశ్చిమబెంగాల్, ఒడిశాల్లోని తీర ప్రాంత జిల్లాలపై ఆంఫన్ ప్రభావం భారీగా ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ సైక్లోన్ ప్రభావంతో పెద్ద వృక్షాలు నేలకూలాయి. చాలాప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో చీకటి అలముకుంది.