మామూలుగా పుట్టిన తర్వాత పసిపిల్లలు తమ సొంత కాళ్లమీద నడవాలంటే కనీసం 12 నెలలు పడుతుంది. కానీ ఈ పిల్లాడు పుట్టిన మరుక్షణమే నర్సును పట్టుకుని నడవడానికి ప్రయత్నించడం చూసినవారికి గగుర్పాటు కలుగుతోంది. అప్పుడే పుట్టిన పిల్లలు కనీసం కళ్లు కూడా సరిగా తెరవరు.. చేతులు ముడుచుకొని ముద్దుగా ఉంటారు. కానీ ఓ పసికందు మాత్రం పుట్టీ పుట్టగానే ఏకంగా నడిచేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అప్పుడేపుట్టిన బాబును నర్సు చేత్తో పట్టుకోగా.. వాడు బెడ్‌పై తెగ నడిచేస్తున్నాడు. బాబు ఎవరు, ఎక్కడ ఏ ఆసుపత్రిలో పుట్టాడు అనే వివరాలు మాత్రం తెలియదు. పుట్టిన వెంటనే నడుస్తున్న ఆ బుడ్డోడిని మీరు కూడా యూట్యూబ్‌లో ఒకసారి చూడండి మరి..!
ఆన్లైన్లో ప్రస్తుతం సంచలనం రేపుతున్న వీడియోలో పసికందు వేస్తున్న తప్పటడుగులు చూస్తున్నవారు అద్భుతం అనకుండా ఉండలేకపోతున్నారు. బ్రెజిల్లో ఒకరి ఫేస్బుక్లో మే 26న పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 5 కోట్ల వ్యూస్‌ని, 13 లక్షల షేర్లను సంపాదించి రికార్డు సృష్టించింది.