ఆదివారం జరిగిన ఈ అందాల అంతిమ పోటీల్లో షేనిస్ విజేతగా నిలించారు. ఆమె పేరును ప్రకటించగానే ఆడిటోరియం మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. తన పేరు ప్రకటించగానే షేనిస్ ఆనంద భాష్పాలను ఆపుకోలేక పోయారు. అంతకుముందు ఆమె కొన్ని క్షణాల ముందు ఆడిటోరియంలో నిశ్బబ్ద వాతావరణం ఆవరించింది. క్షణాలు ఉద్విగ్నంగా మారాయి. అమెరికాకు చెందిన మిస్ యూనిరవర్స్ 2022 ఆర్ బోనీ గాబ్రియెల్ విజేత షేనిస్‌కు కిరీటధారణ చేశారు.
మిస్ యూనివర్స్ 2023గా ఎంపికై షేనిస్ ఆ ఘనత సాధించిన తొలి నికరాగ్వా మహిళగా రికార్డుకెక్కింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో షేనిస్ మెరిశారు. ఆస్ట్రేలియాకు చెందిన మోరయ విల్సన్ సెకండ్ రన్నరప్‌గా నిలువగా, థాయిలాండ్ ముద్దుగుమ్మ అంటోనియా పోర్సిల్డ్ ఫస్ట్ రన్నరప్‌గా ఎంపికయ్యారు.
మిస్ యూనివర్స్ 2023 అందాల పోటీల్లో చండీగఢ్‌కు చెందిన శ్వేత శారద భారత్ తరపున ప్రాతినిథ్యం వహించి టాప్20లోనే ఆగిపోయారు. పాకిస్థాన్ కూడా తొలిసా ఈ పోటీల్లో పాల్గొనడం గమనార్హం. ఈ 72వ మిస్ యూనివర్శ్ 2023 పోటీల్లో మొత్తం 84 దేశాల అందాల భామలు పాల్గొన్నారు. అమెరికన్ టెలివిజన్ పర్సనాలిటీ జీనీ మాయ్, మిస్ యూనివర్స్ 2022 ఒలివియా కల్పోతోపాటు అమెరికన్ టీవీ ప్రజెంటర్ మారియా మెనౌనోస్ ఈ పోటీలకు హోస్ట్‌గా వ్యవహరించారు.