అధికార వర్కర్స్ పార్టీ కేంద్ర కమిటీ ప్లీనరీ సమావేశానికి కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్షత వహించారు. కానీ సమావేశంలో కిమ్ చేసిన వ్యాఖ్యలు మీడియాకు రాలేదు. ప్లీనరీ సమావేశం 2021 సంవత్సరానికి ప్రధాన పార్టీ, విధానాల అమలుపై చర్చించినట్లు ఆ దేశ మీడియా ఊటంకించింది.
ఇకపోతే కిమ్, అధిక బరువును కలిగివున్నారు. ఈయనకు ధూమపానం సంవత్సరాలుగా వున్నట్లు ఊహాగానాలున్నాయి. ముఖ్యంగా అతని కుటుంబానికి గుండె జబ్బుల చరిత్ర ఉంది. 2025లో చైనాతో తన సరిహద్దును తిరిగి తెరిచే వరకు తక్కువ ఆహారం తినాలని కిమ్ అక్టోబర్‌లో తన పౌరులకు చెప్పారు, అయితే ఈ ఏడాది మాత్రమే ఉత్తర కొరియా సుమారు 860,000 టన్నుల ఆహారం తక్కువగా ఉందని ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ అంచనా వేసింది.