ఓ స్పాలో లభించిన సీసీ టీవీ ఫూటేజీలో అతను కూడా ఉన్నాడని ఆరోపిస్తూ అతడిని అదుపులోకి తీసుకున్నారు. తాను నేరం చేయలేదని ఎంత వాదించినా వినకుండా అరెస్టు చేసి జైల్లో పడేశారు. వీడియో రికార్డయిన సమయంలో తాను అక్కడ లేనని, చికాగోలో ఉన్నానని బాధితుడు మొరపెట్టుకున్నాడు.
కానీ విచారణలో పోలీసులదే పొరపాటు అని తేలింది. ఫూటేజీలో ఉన్నది సందీప్ పాటిల్ కాదని నిర్ధారించారు. కానీ ఎన్నారై మాత్రం తన కుటుంబానికి భారీ నష్టం కలిగిందని తన ఇద్దరు కూతుళ్లకు తన ముఖం ఎలా చూపాలని వాపోతున్నాడు. అంతే కాకుండా వ్యభిచారం కేసులో ఇరుక్కున్న తన కూతుళ్లను ఎవరు పెళ్లి చేసుకుంటారని ఆవేదన చెందుతున్నారు. దీనికి ప్రభుత్వం పరిహారం చెల్లించక తప్పదని డిమాండ్ చేశారు.