పాకిస్థాన్‌కు అజిత్ దోవల్ సీరియస్ వార్నింగ్

సోమవారం, 27 నవంబరు 2017 (11:18 IST)
ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయ్యద్‌ను గృహ నిర్భంధం నుంచి పాకిస్థాన్ కోర్టు విడిపించిన వేళ.. అమెరికా వంటి దేశాలు పాకిస్థాన్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. గృహ నిర్భంధం నుంచి విడుదలైన గంటల్లోనే హఫీజ్ కాశ్మీర్ అంశంపై నోటికొచ్చినట్లు మాట్లాడాడని.. అతనిపై కేసు నమోదు చేసుకుని ఇప్పటికైనా అరెస్ట్ చేయండని పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది.
 
ఈ నేపథ్యంలో గత ఏడాది జనవరిలో పఠాన్‌కోట్ వైమానిక స్థావ‌రంపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు దాడి చేసిన పిమ్మట భార‌త జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవ‌ల్ పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చారట. పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ నాజర్ ఖాన్‌కు ఆయన ఫోన్ చేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని జాతీయా మీడియా ప్రస్తుతం వెలుగులోకి తెచ్చింది. 
 
ప‌ఠాన్‌కోట్ దాడిలో కీల‌క నిందితులైన కాషిఫ్ జాన్‌, షాహిద్ ల‌తీఫ్‌తోపాటు మ‌రో న‌లుగురి జాడ తెలియ‌ద‌ని పాకిస్థాన్ తప్పించుకోవడంతో నాజర్ ఖాన్‌ను దోవల్ నిలదీసినట్లు తెలుస్తోంది. ప‌ఠాన్‌కోట్ దాడి త‌ర్వాత ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ప్ప‌టికీ ఇరు దేశాల ఎన్ఎస్ఏలు ర‌హ‌స్య మంత‌నాలు జ‌ర‌ప‌డం విశేష‌మ‌ని జాతీయ మీడియా ఊటంకించింది. దోవల్ పాకిస్థాన్‌ను హెచ్చరించినా.. టెర్రరిస్టులకు అరెస్ట్ చేయడంలో పాకిస్థాన్ వెనక్కి తగ్గుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు