బోట్స్‌వానాలో 350 ఏనుగుల మృతి.. ఇదెలా జరుగుతుంది?

శుక్రవారం, 3 జులై 2020 (22:43 IST)
Botswana
బోట్స్‌వానాలో ఏనుగుల భారీ సంఖ్య మృతి చెందడం ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవరపెడుతుంది. బోట్స్‌వానాలో 1990 చివరలో ఏనుగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అక్కడ ఏనుగుల సంఖ్య 80,000 నుండి 1.30 లక్షల వరకు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. వేటపై కఠిన నిషేధం విధించడం కారణంగా ఏనుగుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో బోట్స్‌వానాలో ఇప్పటివరకు 350 ఏనుగులు మృత్యువాతపడ్డాయి. ఆఫ్రికాలో క్షీణిస్తున్న ఏనుగుల జనాభాలో మూడింట ఒక వంతు బోట్స్‌వానాలో ఉన్నాయి. బోట్స్‌వానాలోని వాయువ్య భాగంలో భారీ ఎత్తున ఏనుగులు మృతి చెందడంపై మిస్టరీ ఇంకా వీడలేదు. ఏనుగులు ఎలా చనిపోతున్నాయనేది పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. 
 
ఆ ఏనుగులను వేటాడి చంపిన ఆనవాళ్లుగానీ, వాటి మృతదేహాలపై ఎలాంటి గాయాల గుర్తులు గానీ లేవు. మానవులే విషాన్నిచ్చి చంపారనే వాదనను కూడా తోసిపుచ్చుతున్నారు. బోట్స్‌వానాలోని ప్రాంతంలో వన్యప్రాణులను చంపడానికి ఎక్కువగా ఆంత్రాక్స్ అనే విషాన్ని ఉపయోగిస్తుంటారు. ఏనుగుల మరణానికి ఖచ్చితమైన కారణాలు తెలుసుకొనే అన్వేషణలో ఉన్నామని బోట్స్‌వానా ప్రాంతీయ వన్యప్రాణి సమన్వయకర్త డిమాకాట్సో నాట్షెబే చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు