పాకిస్థాన్ పాలకులే కాదు.. ఆ దేశానికి చెందిన విమానయాన సంస్థ పైలట్లు కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారని మరోమారు నిరూపితమైంది. ఏకంగా 305 మంది ప్రయాణికుల ప్రాణాలను ట్రైనీ పైలట్ చేతిలో పెట్టిన ఓ పైలట్.. క్యాబిన్‌లో గుర్రుపెట్టి నిద్రపోయాడు. అలా ఏకంగా రెండున్నర గంటల పాటు నిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే...