Unni Mukundan, director Joshi
మలయాళ సినీ పరిశ్రమలో లెజెండరీ దర్శకుడు జోషీ, ఉన్ని ముఖుందన్ ఫిల్మ్స్ (UMF), ఐన్‌స్టిన్ మీడియా సంయుక్తంగా నిర్మించబోయే హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్‌కి దర్శకత్వం వహించ నున్నారు. నేడు జోషీ పుట్టినరోజున ఈ ప్రకటన వెలువడింది, ఇది భారతీయ సినిమాని ఆకృతీకరించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన స్వరాల్లో ఒకరైన జోషీ గారికి గౌరవంగా, ఒక గాఢమైన అభినందనగా నిలుస్తోంది. దశాబ్దాల సినీ ప్రయాణం, అనేక బ్లాక్‌బస్టర్లతో తరాలు తరాల అభిమానాన్ని గెలుచుకున్న జోషీ గారు ఇప్పుడు వింటేజ్ స్కేల్‌తో పాటు ఆధునిక కథనం కలబోసిన ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.