పాకిస్థాన్ రక్షణ మంత్రి, పీఎంఎల్ ఎన్ పార్టీ కీలక నేత ఖ్వాజా మొహ్మద్ ఆసిఫ్ కీలక ప్రకటన చేశారు. తమ దేశం దివాళా తీసిందని చెప్పారు ఈ మేరకు ఆయన ఓ సభలో ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి సంచలంగా, చర్చనీయాంశంగా మారాయి.
"మనం ఇపుడు దివాళా తీసిన దేశంలో జీవిస్తున్నాం. పాకిస్థాన్ విదేశీ అప్పులు చెల్లించలేకపోతోంది. ఆర్థిక సంక్షోభంలో ఉందన్న వార్తలు మీరందరూ వినే ఉంటారు. కానీ, ఇది ఇప్పటికే జరిగిపోయింది. మనం దివాళా తీశాం. ఇపుడు మనం మళ్లీ మనకాళ్లపై నిలబడాలి. ఈ సమస్యకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సాయం పరిష్కారం కాదు. అసలు పరిష్కారం మన దేశంలోనే ఉంది" అని అన్నారు.