గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల గ్రెనెడ్ దాడులు, ఫైరింగ్ జరుగుతున్నట్లు వార్తసంస్థలు వెల్లడిస్తున్నాయి. బెలుచిస్తాన్ ప్రావిన్స్, స్వాబీ పట్టణాలల్లో కూడా దాడులు జరుగుతున్నాయి.
పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) నేత చౌదురి మహ్మద్ సర్వార్ క్వెట్టా ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రవాదులు ఎప్పటికీ విజయం సాధించలేరని ఆయన జోస్యం చెప్పారు. కాగా ఓటింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు రికార్డు స్థాయిలో 3,71,388 మంది బలగాలను మోహరించారు.
పార్లమెంటులోని 272 స్థానాలకు 3,459 మంది, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లోని 577 స్థానాలకు 8,396 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. దేశంలో మొత్తం 10 కోట్ల మంది రిజిస్టర్డు ఓటర్లు ఉన్నారు. దేశవ్యాప్తంగా 85 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ను శాంతియుతంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం భారీగా ఏర్పాట్లు చేసింది.
70 ఏళ్ల దేశ చరిత్రలో రెండు పౌర ప్రభుత్వాల మధ్య అధికార మార్పిడి జరగడం ఇదే రెండోసారి. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్, బిలావల్ భుట్టో నేతృత్వంలోని పీపీపీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే పార్టీ వర్గాలతో పాటు పాకిస్థాన్ క్రికెట్ కుటుంబమంతా ఇమ్రాన్ ఖాన్‌ను మించిన ప్రధాని అభ్యర్థి పాకిస్థాన్‌కి లేడని ముక్త కంఠంతో చెబుతోంది.