భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ ఆర్మీ సెక్టార్‌పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి 18 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెల్సిందే. దీని వెనుక పాకిస్థాన్ హస్తమున్నట్టు ప్రపంచం కోడై కూస్తోంది. అదేసమయంలో పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని దేశీయంగా తీవ్రమైన ఒత్తిడులు వస్తున్నాయి.
అయితే, దేశ రాజధాని ఇస్లామాబాద్, లాహోర్ మధ్య రహదారిని మూసేసి మరీ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇది సాధారణ శిక్షణేనని, యురీ ఘటన నేపథ్యంలో పెరిగిన ఉద్రిక్తలు కారణం కాదని వైమానిక దళాధికారులు చెప్తున్నారు.
పాకిస్థాన్ వైమానిక దళం అధికార ప్రతినిధి కమొడోర్ జావేద్ మహ్మద్ అలీ మాట్లాడుతూ విమానాలు రోడ్లపైకి వచ్చాయని, కొన్నేళ్ళుగా వాళ్ళు ఇలాగే చేస్తున్నారన్నారు. రన్‌వేలు పాడైనా, అందుబాటులో లేకపోయినా ఈ డ్రిల్ ఉపయోగపడుతుందన్నారు. ఈ విన్యాసాలను ఇటీవల భారత్‌తో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్వహించడం లేదన్నారు.