క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళుతున్న జఫార్ ఎక్స్‌ప్రెస్‌ను బలూచ్ లిపరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) హైజాక్ చేసిన విషయం తెల్సిందే. రైలులోని 9 బోగీల్లో ఉన్న 440 మందిని వారు బందీలుగా పట్టుకున్న విషయం తెల్సిందే. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ విజయవంతంగా ఆపరేషన్‌ను ముగించి, రైలను తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకుంది. మంగళవారం సాయంత్రానికి 100 మంది ప్రయాణికులు రక్షించిన భద్రతా బలగాలు, నిన్న మిగతా ప్రయాణికులను రక్షించాయి.
బలూచిస్థాన్ ప్రావిన్స్‌కు స్వయం ప్రతిపత్తి కోసం బీఎల్ఏ మిలిటెంట్లు గత కొంతకాలంగా పోరాటం చేస్తుంది. ఇందులోభాగంగా, జఫార్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన విషయం తెల్సిందే. ఈ సమాచారం తెలుసుకున్న పాక్ సైనిక బలగాలు రంగంలోకి దిగి 33 మంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు హతమయ్యారు.
అలాగే, 21 మంది ప్రయాణికులు, నలుగురు పారామిలిటరీ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని, రైలులోని మిగిలిన ప్రయాణికులను కాపాడామని ఆర్మీ అధికారి ప్రతినిధి లెఫ్టినెంట్, జనరల్ ఆహ్మద్ షరీఫ్ తెలిపారు. మంగళవారానికి సాయంత్రానికి 100 మంది ప్రయాణికులను రక్షించి భద్రతా బలగాలు, నిన్న మిగతా ప్రయాణికులను రక్షించాయి.